10 నుంచి మాదిగల ధర్మపోరాటం | madigala dharmaporatam from 10th | Sakshi
Sakshi News home page

10 నుంచి మాదిగల ధర్మపోరాటం

Oct 31 2016 9:14 PM | Updated on Sep 4 2017 6:48 PM

10 నుంచి మాదిగల ధర్మపోరాటం

10 నుంచి మాదిగల ధర్మపోరాటం

ధర్మపోరాట రథయాత్ర కార్యక్రమం నవంబర్‌ 10 నుంచి ప్రారంభమవుతుందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ తెలిపారు.

- ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ
 
కర్నూలు సీక్యాంప్‌: ధర్మపోరాట రథయాత్ర కార్యక్రమం నవంబర్‌ 10 నుంచి ప్రారంభమవుతుందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ తెలిపారు. సోమవారం అంబేడ్కర్‌భవన్‌లో రాష్ట్ర ఎమ్మార్పీఎస్‌ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ..ఎన్నికల మందు వర్గీకరణ చేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మాటతప్పి మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను వివరిస్తూ నవంబర్‌ 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మపోరాట రథయాత్ర ప్రారంభమవుతుందని..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంతటా పర్యటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు నరసింహులు మాదిగ, పూలరాజు, ఈశ్వర్, గోపి, మట్టి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement