మాడా అంత్యక్రియలు 28న | Mada funeral 28 | Sakshi
Sakshi News home page

మాడా అంత్యక్రియలు 28న

Oct 26 2015 4:20 AM | Updated on Aug 20 2018 2:31 PM

మాడా అంత్యక్రియలు 28న - Sakshi

మాడా అంత్యక్రియలు 28న

ప్రముఖ హాస్యనటుడు మాడావెంకటేశ్వరరావు (66) అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు మాడావెంకటేశ్వరరావు (66) అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో మాడా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు నలుగురు కుమార్తెలు. కాగా ఒక కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. ఆమె మంగళవారం నగరానికి చేరుకుంటారని, బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని వారు తెలిపారు.

బుధవారం ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయా న్ని మొదట ఫిలింనగర్ రోడ్ నం.1లోని ఆయన నివాసానికి అభిమానుల సందర్శనార్థం తీసుకురానున్నారు. అనంతరం ఫిలిం ఛాంబర్‌లో ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచి అటు నుంచి అంత్యక్రియలకు ఊరేగింపుగా తీసుకెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement