
అపోలో హాస్పిటల్స్ తమ 42వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. దాదాపు 200 మిలియన్లకు పైగా జీవితాలను స్పృశించటంతో పాటుగా, 185 దేశాలలో నమ్మకాన్ని సంపాదించిన అపోలో హాస్పిటల్స్, భారతదేశంలో 19000కు పైగా పిన్‌కోడ్‌లను చేరుకుంది. 1983లో భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అపోలో, నాలుగు దశాబ్దాలలో 51 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు, 27000 కు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ విప్లవానికి నాంది పలికింది. దేశంలో నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ మానవ మూలధనాన్ని గణనీయంగా పెంచుతూ అపోలో 11 లక్షలకు పైగా నిపుణులకు శిక్షణ ఇచ్చింది.
దేశ ఆరోగ్య సంరక్షణ నాణ్యతపై నమ్మకాన్ని సృష్టించడం ద్వారా, భారతదేశాన్ని ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ గమ్యస్థానంగా అపోలో మార్చింది. అంతకుముందు చికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు రోగులు వెళ్లే ధోరణినీ మార్చింది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ, “అపోలో 1983లో ప్రారంభమైనప్పుడు, అది కేవలం ఒక ఆసుపత్రి ప్రారంభం మాత్రమే కాదు, ఒక ఉద్యమం యొక్క పుట్టుక. నాలుగు దశాబ్దాలుగా, ఆ ఉద్యమం 200 మిలియన్ల జీవితాలను తాకిన శక్తిగా ఎదిగింది. 185 దేశాలలో విశ్వాసాన్ని పెంపొందించుకుంది, ఆరోగ్య సంరక్షణలో సాధ్యమయ్యే వాటిని పునర్నిర్వచించింది. ప్రపంచ స్థాయి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా భవిష్యత్తుకు సిద్ధంగా వాటిని ఉంచడం మా లక్ష్యం. ప్రపంచ వేదికపై భారతదేశం ఎదుగుతున్నవేళ, అపోలో ఒక చోదక శక్తిగా నిలుస్తుంది, ఆరోగ్యకరమైన సమాజాలను రూపొందిస్తుంది, వైద్య సరిహద్దులను అధిగమిస్తుంది, ప్రతిచోటా కుటుంబాలు ఆశ, ఆరోగ్యం ,ఆనందంతో భవిష్యత్తును చూడగలవని నిర్ధారిస్తుంది ” అని తెలిపారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీత రెడ్డి మాట్లాడుతూ, “ఒక దేశం యొక్క బలం దాని ప్రజల ఆరోగ్యంలో దాగి ఉంది. భారతదేశ వైద్యులు, నర్సులు , సంరక్షకులు. అపోలో వద్ద , మేము ఆసుపత్రులను మాత్రమే కాకుండా, మానవ వనరులను తీర్చిదిద్దాము. మనం ప్రజలపై పెట్టుబడి పెట్టినప్పుడు, మన దేశం యొక్క గౌరవం, స్థిరత్వం, భవిష్యత్తుపై కూడా పెట్టుబడి పెట్టినట్లేనని వ్యాఖ్యానించారు.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీత రెడ్డి మాట్లాడుతూ..ఆరోగ్య సంరక్షణ నుండి అధునాతన చికిత్సల వరకు, డిజిటల్ ఆరోగ్యం నుండి పరిశోధన వరకు, ప్రతి విస్తరణ నమ్మకం, లభ్యత ప్రభావంపై నిర్మించబడింది. దేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే దశలో ఉన్నందున, ఆరోగ్య సంరక్షణ దాని బలమైన పునాదిగా ఉండాలి. 1.4 బిలియన్ల జనాభా ఉన్న ఈ దేశంలోని ప్రతి మూలకు నాణ్యమైన సంరక్షణ చేరేలా చూడటం అపోలో లక్ష్యం’అని పేర్కొన్నారు.