
అశ్రునయనాల మధ్య మాడా అంత్యక్రియలు
ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలను హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలను హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. మాడా వెంకటేశ్వర్‌రావు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన కుమార్తె రాక ఆలస్యం కావడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో మాడా భౌతికకాయాన్ని తరలించారు. సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, జి.వి.సుబ్బయ్య, కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేశ్ నాయుడు తదితరులు హాజరయ్యారు.