పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి | lovers knot tie in presence of parents in narnur | Sakshi
Sakshi News home page

పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి

Aug 7 2016 11:21 AM | Updated on Sep 4 2017 8:17 AM

నార్నూర్‌లో శనివారం ఓ ప్రేమ జంటకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.

నార్నూర్‌: నార్నూర్‌లో శనివారం ఓ ప్రేమ జంటకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నార్నూర్‌ మండలం గుండాల గ్రామానికి చెందిన రాథోడ్‌ లావణ్య ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతోంది. అక్కడే మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో ఉంటోంది. బోథ్‌ మండలం సాకెర గ్రామానికి చెందిన చౌహాన్‌ రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇది ప్రే మగా మారింది. ఇదిలా ఉండగా శుక్రవారం మేనేజ్‌మెంట్‌ హా స్టల్‌ నుంచి లావణ్య ఇంటికి ఫోన్‌ చేసి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలిపారు.

దీంతో లావణ్య కుటుంబ సభ్యులు వచ్చి ఆ మెను శనివారం ఉదయం ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. సదరు యువకుడు రమేశ్‌ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య తెలిపింది. దీంతో ఆ మె కుటుంబ సభ్యులు కుల పెద్దలను ఆశ్రయించారు. యువకుడిని పిలిపించి ప్రశ్నించగా.. ప్రేమించినట్లు ఒప్పుకోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. ఎంపీటీసీలు, బంధువు వెంకటరాం, గణేశ్‌ రాథోడ్, రాజేశ్వర్, సురేశ్, యశ్వంతరావ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement