ప్రేమికుడి ఆత్మహత్య | lover suside | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి ఆత్మహత్య

Aug 7 2016 10:21 PM | Updated on Sep 4 2017 8:17 AM

సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని పాత జెండాకు చెందిన కోటగిరి నాగరాజు (28) ఆదివారం మృతి చెందినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం వరంగల్‌కు చెందిన యువకునితో నిశ్చితార్థం ఉండగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని పాత జెండాకు చెందిన కోటగిరి నాగరాజు (28) ఆదివారం మృతి చెందినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం వరంగల్‌కు చెందిన యువకునితో నిశ్చితార్థం ఉండగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చనిపోయే ముందు నాలుగు పేజీల లేఖను రాసి మంచం పక్కన పెట్టినట్లు వారు తెలిపారు. నాగరాజు  ఐదేళ్ల  క్రితం ఇదే గ్రామానికి చెందిన యువతిని తాను ప్రేమించానని.. మూడేళ్ల నుంచి  పెళ్లి సంబంధాలు చూస్తుండగా ప్రేమికులిద్దరు కుటుంబసభ్యులకు పెళ్లి విషయం చెప్పినట్లు లేఖలో పేర్కొన్నాడు. యువతి కుటుంబసభ్యులు తనపై దాడి చేశారని మృతుడు తెలిపాడు. సోదరుడు వినోద్‌ సైతం పోలీసులకు తన అన్న నాగరాజు చనిపోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement