లారీ ఢీకొని ఒకరి మృతి | Lory Hit one man dead | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఒకరి మృతి

Aug 14 2016 10:11 PM | Updated on Sep 4 2017 9:17 AM

మండలంలోని జాతీయ రహదారిపై డాబా వద్ద ఆదివారం లారీ, బైక్‌ ఢీకొనడంతో భర్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలపాలైంది.

 దువ్వూరు: మండలంలోని జాతీయ రహదారిపై డాబా వద్ద ఆదివారం లారీ, బైక్‌ ఢీకొనడంతో భర్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాడుకు చెందిన గద్దా బాలయ్య అలియాస్‌ యేసోబు (46), ఆయన భార్య మరియమ్మ దువ్వూరులోని చర్చికి ప్రార్థనల నిమిత్తం వచ్చారు. తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో బైక్‌పై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. డాబా యజమాని మనోహర్‌రెడ్డి వీరిని తన ఆటోలో దువ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో బాలయ్య సాయంత్రం మృతి చెందాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు.

Advertisement
 
Advertisement
Advertisement