ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..బాలిక మృతి | lorry ravages into house, girl died | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..బాలిక మృతి

Nov 26 2016 10:25 AM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలిక మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

కొత్తగూడెం: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ బాలిక మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంలో మౌనిక(16) మృతిచెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్థులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement