స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న పెనుబాక కాలనీ వాసులు
మద్యం వద్దన్నందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరిపేందుకు వీల్లేదంటూ కొన్నాళ్ల కిందట పెనుబాక దళిత కాలనీవాసులు సంబంధిత విక్రయాలను అడ్డుకున్నారు. విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే కొద్ది రోజుల పాటు ఊరుకున్న మద్యం వ్యాపారుల వ్యక్తులు గుర్తు తెలియని పేర్లతో కాలనీ వాసులను హెచ్చరిస్తూ తాజాగా లేఖలు పంపారు. దీనిపై ఆగ్రహించిన కాలనీ వాసులు నిరసన ర్యాలీ నిర్వహించారు
మద్యం వద్దంటే బెదిరింపు లేఖలు
లేఖల తీరుపై పెనుబాక కాలనీవాసుల నిరసన ర్యాలీ
పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన
మద్యం వద్దన్నందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ గ్రామంలో మద్యం విక్రయాలు జరిపేందుకు వీల్లేదంటూ కొన్నాళ్ల కిందట పెనుబాక దళిత కాలనీవాసులు సంబంధిత విక్రయాలను అడ్డుకున్నారు. విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే కొద్ది రోజుల పాటు ఊరుకున్న మద్యం వ్యాపారుల వ్యక్తులు గుర్తు తెలియని పేర్లతో కాలనీ వాసులను హెచ్చరిస్తూ తాజాగా లేఖలు పంపారు. దీనిపై ఆగ్రహించిన కాలనీ వాసులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సంబంధిత లేఖలు రాసిన వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే...
రాజాం: గ్రామంలో మద్యం విక్రయాలు నిలిపి వేయమన్నందుకు బెదిరింపు లేఖలు పంపిస్తున్నారు. అసభ్య పదజాలాలతో ఆడవాళ్లను అవమానపరిచే విధంగా లేఖలు రాసారు. దీంతో ఆందోళన చెందిన పెనుబాక కాలనీ వాసులు సంబంధిత వ్యక్తులపై చర్యలకు డిమాండ్ చేస్తూ సుమారు ఐదు కిలోమీటర్ల దూరాన నిరసన ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ర్యాలీగా రాజాం పోలీసుస్టేషన్‌కు వచ్చి మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. ఇదేం చోద్యమంటూ ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... మండల పరిధిలోని పెనుబాక గ్రామంలో మూడు నెలలు కిందట బెల్ట్ దుకాణాలకు సంబంధించి వేలం పాట నిర్వహించారు. దీంతో ఈ పాటను వ్యతిరేకిస్తూ గ్రామంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని గ్రామంలోని దళిత కాలనీకి చెందిన పలువురు డిమాండ్ చేశారు. విక్రయాలు జరిపితే దాడులకు సైతం పాల్పడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి.
బెదిరింపు లేఖలు
వీటిని సహించలేని మద్యం విక్రయాలు కొందరు వ్యక్తులు దళిత కాలనీకి చెందిన బలగ సూర్యనారాయణ, టొంపల గణేష్‌లకు ఆదివారం ఉదయం వేర్వేరుగా పోస్టు ద్వారా లేఖలను బట్వాడా చేశారు. ఈ లేఖల్లో సూర్యనారాయణ, గణేష్ కుటుంబాలను ఎస్సీ కులంతో తిట్టడమే కాకుండా వారి ఇళ్లల్లో ఉన్న భార్య, పిల్లలను అసభ్య పదజాలాలతో తిడుతూ లేఖ రాసారు. దీంతో ఆందోళనకు గురైన ఆయా కుటుంబాలు వారు కాలనీ వాసులైన బలగ అప్పన్న, బలగ నర్శింహులు, జరజాన గణేష్ తదితర వారికి వాటిని చూపించి సుమారు 200 మందితో ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజాం పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆ లేఖలపై సీఐ శంకరరావుకు ఫిర్యాదు చేశారు. తక్షణమే లేఖలు రాసిన∙వారిని గుర్తించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఐ మాట్లాడుతూ దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతామని తెలిపారు.