హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు | life time jail in murder case | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు

Dec 27 2016 9:08 PM | Updated on Jul 30 2018 8:29 PM

నరసరావుపేటటౌన్: హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె. జయకుమార్‌ మంగళవారం తీర్పు చెప్పారు.

 
నరసరావుపేటటౌన్: హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె. జయకుమార్‌ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన యర్రగోర్ల బాజి గత ఏడాది ఫిబ్రవరి 25వతేదీన కోటప్పకొండ మెట్లమార్గం వద్ద బాణావత్‌ అంజినాయక్‌ అనే వ్యక్తి మరో యువతితో మాట్లాడుతుండగా వారిపై    కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం యువతి మెడలో బంగారు గొలుసును అపహరించుకొని పరారయ్యాడు.   తీవ్రగాయాలైన అంజినాయక్‌ అక్కడికక్కడే మృతిచెందగా గాయాలపాలైన యువతిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.   బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకున్న రూరల్‌ సీఐ ప్రభాకర్‌ ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. సాక్షుల్ని విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువుకావడంతో పైవిధంగా తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ బాలసత్యనారాయణ రెడ్డి నిర్వహించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement