అన్నింటా అగ్రగామి ఎల్‌ఐసీ | LIC is top best | Sakshi
Sakshi News home page

అన్నింటా అగ్రగామి ఎల్‌ఐసీ

Sep 1 2016 11:40 PM | Updated on Sep 4 2017 11:52 AM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీమాకంపెనీల్లో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా నిలుస్తుందని ఆ సంస్థ బ్రాంచ్‌–1 ఎస్‌బీఎం కె.స్వరూప్‌కుమార్‌ అన్నారు.

కరీంనగర్‌: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీమాకంపెనీల్లో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా నిలుస్తుందని ఆ సంస్థ బ్రాంచ్‌–1 ఎస్‌బీఎం కె.స్వరూప్‌కుమార్‌ అన్నారు. గురువారం బ్రాంచ్‌–1 కార్యాలయంలో బీమా వారోత్సవాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం నర్సయ్య ప్రారంభించారు. ఎస్‌బీఎం స్వరూప్‌కుమార్‌ మాట్లాడుతూ పాలసీదారుల సంక్షేమంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే గురుతర బాధ్యతను ఎల్‌ఐసీ పోషిస్తుందన్నారు. బీమా సంస్థ ఆవిర్భవించి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారం రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాంచ్‌–1 అధికారులు, సిబ్బంది, ఐసీఈయూ బ్రాంచ్‌ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, బుచ్చయ్య, ఏజెంట్లు, పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement