బావిలో చిరుత... | leapord falls in well, rescued | Sakshi
Sakshi News home page

బావిలో చిరుత...

May 3 2016 8:46 PM | Updated on Sep 3 2017 11:20 PM

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట శివారులోని గుర్రాల ఆనందరెడ్డి వ్యవసాయబావిలో ఓ చిరుతపులి పిల్ల పడింది.

ఇల్లంతకుంట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట శివారులోని గుర్రాల ఆనందరెడ్డి వ్యవసాయబావిలో ఓ చిరుతపులి పిల్ల పడింది. మంగళవారం ఉదయం ఆనందరెడ్డి బావి వద్దకు వెళ్లగా అరుపులు వినిపించడంతో బావిలోకి చూశాడు. బావిలో చిరుత పులి ఉందని గమనించి పోలీసులకు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుమితారావు వెంటనే అక్కడకు చేరుకుని వరంగల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు.

క్రేన్ సాయంతో బావిలోకి బోను దించినప్పటికీ చిరుత అందులోకి రాకపోవడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బయటకు తీశారు. చిరుత నీరసంగా ఉండటంతో వైద్యపరీక్షలు నిర్వహించి వరంగల్‌కు తరలించారు. చిరుత పిల్ల చిక్కడంతో పెద్దలింగాపూర్, సోమారంపేట శివార్లలోని గుట్టల ప్రాంతంలో మరో మూడు చిరుత పులులు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement