గురజాడ పురస్కారానికి లక్ష్మయ్య | Lakshmayya selected for gurajada award | Sakshi
Sakshi News home page

గురజాడ పురస్కారానికి లక్ష్మయ్య

Sep 15 2016 9:39 PM | Updated on Sep 4 2017 1:37 PM

లక్ష్మయ్య

లక్ష్మయ్య

గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) ఆధ్వర్యంలో రాష్ట్ట్రస్థాయి తెలుగు పురస్కారం-2016కు తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య అవార్డుకు ఎంపికయ్యారు.

సిద్దిపేట రూరల్‌: గురజాడ ఫౌండేషన్‌ (అమెరికా) ఆధ్వర్యంలో రాష్ట్ట్రస్థాయి తెలుగు పురస్కారం-2016కు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు వరుకోలు లక్ష్మయ్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు సాహిత్యంలో రచయితగా, పద్యాలు రాయడంలో కవిగా తెలుగు భాషకు విషేశ కృషి గుర్తింపు లభించింది.

2016 జూన్‌ తెలం‘గానం’లో పద్యాలు వ్రాసి వినిపించినందుకు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానంతో పాటు శ్రీకాళహస్తిలో జాతీయ తెలుగు సమ్మెళనంలో ఆగస్టులో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌ చేతుల మీదుగా సన్మానం పొందారు. కాగా, గురజాడ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు సంటి అనిల్‌కుమార్‌ చేతుల మీదుగా ఈ నెల 18న హైదారాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో అందుకోనున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement