వివాహిత ఆత్మహత్య | lady sucide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 30 2016 1:13 AM | Updated on Sep 4 2017 3:31 PM

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

నెల్లూరు (క్రైమ్‌) : అవమానంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పాత చెక్‌పోస్టు వద్ద గురువారం చోటు చేసుకుంది. పాత చెక్‌పోస్టు సమీపంలో వెంకటేశ్వర్లు, లక్ష్మి (24) దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 
నెల్లూరు (క్రైమ్‌) : అవమానంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పాత చెక్‌పోస్టు వద్ద గురువారం చోటు చేసుకుంది. పాత చెక్‌పోస్టు సమీపంలో వెంకటేశ్వర్లు, లక్ష్మి (24) దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి ఎదురు ఇంట్లో శివ కుటుంబం నివాసముంటుంది. కొంత కాలంగా లక్ష్మిపై శివ మనస్సుపడ్డాడు. ఎలాగైనా ఆమెను లొంగ దీసుకోవాలని ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయం శివ ఇంట్లో తెలియడంతో శివ అతని భార్య నడుమ విభేదాలు పొడచూపాయి. గురువారం వెంకటేశ్వర్లు పనికి వెళ్లాడు. లక్ష్మి ఒక్కటే ఇంట్లో ఉంది. లక్ష్మి విషయమై శివకు, అతని భార్యకు మరోమారు తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో  కోపోద్రిక్తురాలైన శివ భార్య లక్ష్మి వద్దకు వెళ్లింది. తన భర్తకు ఎం మందుపెట్టావు? ఎం చేశావు తనను పట్టించుకోవడం లేదంటూ ఆమెతో గొడవకు దిగింది. ఉంటే నీవైనా తనతో ఉండు...లేదంటే అతన్ని వదిలివేయాలని.. లేకుంటే అంతుచూస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న భర్త పని నుంచి ఇంటికి వచ్చాడు. భార్య మృతదేహం వద్ద కుప్పకూలిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. లక్ష్మి ఆత్మహత్య చేసుకోవవంతో శివ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement