ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు: హరీశ్ | Lacs of jobs to be released with in year | Sakshi
Sakshi News home page

ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు: హరీశ్

Feb 15 2016 2:10 AM | Updated on Sep 3 2017 5:39 PM

ఈ ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు.

సిద్దిపేట జోన్: ఈ ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో గ్రూప్-2 ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 6 నెలల నుంచి ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలను  భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్వహించే నియామక ప్రక్రియల్లో యువత ధృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో పాల్గొని ఉద్యోగాలను సాధిం చాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీజేఆర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement