బరాజ్‌లను మళ్లీ హరీశ్‌కు అప్పగించాలా? | Uttam Kumar Reddy Fires On Harish Rao | Sakshi
Sakshi News home page

బరాజ్‌లను మళ్లీ హరీశ్‌కు అప్పగించాలా?

Oct 25 2026 1:43 AM | Updated on Oct 25 2026 1:43 AM

Uttam Kumar Reddy Fires On Harish Rao

ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌ 

ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఉంటే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లను తనకు అప్పగిస్తే 6 నెలల్లో పునరుద్ధరించి ఇస్తానని చెప్పడానికి బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు సిగ్గుండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి పదవి నుంచి హరీశ్‌రావును గతంలో కేసీఆర్‌ పీకేశారని.. ఆయన ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన మేడిగడ్డ బరాజ్‌ కుంగిపోయిందని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ మళ్లీ బరాజ్‌లను ఆయనకే అప్పగించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ తప్పిదాలు, అవినీతితోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ. లక్ష కోట్లు ఖర్చయిందని.. మళ్లీ వారి వల్లే బరాజ్‌ల పునరుద్ధరణకు మరో రూ. 2–3 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని తప్పుబట్టారు. మంత్రి గడ్డం వివేక్‌తో కలిసి శనివారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

మరమ్మతులు పూర్తయ్యే వరకు మూడు బరాజ్‌ల గేట్లు ఎత్తిపెట్టాలని ఎన్డీఎస్‌ఏ కోరిందని.. దీంతో నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మేడిగడ్డ బరాజ్‌కు 18–19 కి.మీ.ల దూరంలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే బరాజ్‌ గేట్లు దింపాల్సి ఉంటుందన్నారు. వర్షాల్లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతలు సంతోíÙస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారంలో జోసెఫ్‌ గోబెల్స్‌ను ఎన్నోరేట్లు మించిపోయిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వారి పేర్ల ముందు గోబెల్స్‌ పేరు చేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచి్చన అప్పులు సరిగ్గా ఖర్చు చేసి ఉంటే తెలంగాణ రైతాంగానికి ఇంత నష్టం జరిగేది కాదని ఉత్తమ్‌ పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఉపయోగంలో లేకపోయినా గతేడాది దేశంలోనే అత్యధికం ధాన్యం పండించిన, సమీకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.  

రైతుల కష్టాలకు బీఆర్‌ఎస్‌ నేతలే కారణం.. 
తెలంగాణ రైతాంగ ఇబ్బందులకు కారకులైన వారే ఉల్టా చోర్‌ కోత్వాల్‌కు డాంటే తరహాలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టును యథాతథంగా పూర్తి చేసి ఉంటే ఎన్ని ఎల్‌నినోలు వచి్చనా ఉత్తర తెలంగాణ సస్యశామలంగా ఉండేదన్నారు. రూ. 38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో రీడిజైన్‌ చేసి రూ. 1.5 లక్షల కోట్లకు పెంచారని తప్పుబట్టారు. రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత–చెవెళ్లను పూర్తి చేసి ఉంటే మిగిలిన నిధులతో పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు మూలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మూలాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించి కేసీఆర్‌ ఘోర తప్పిదానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని, నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్, ఇతరులేనని మంత్రి ఉత్తమ్‌ విమర్శించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement