కార్మికులకు కనీస వేతనం ఖరారు | labours minimum wase declare | Sakshi
Sakshi News home page

కార్మికులకు కనీస వేతనం ఖరారు

Oct 19 2016 12:46 AM | Updated on Sep 4 2017 5:36 PM

జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్‌స్కిల్డ్‌ (నైపుణ్యం లేని) కార్మికుల రోజువారీ కనీస వేతనం ఖరారు చేస్తూ కలెక్టర్‌ కోన శశిధర్‌ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు.

అనంతపురం అర్బన్‌: జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్‌స్కిల్డ్‌ (నైపుణ్యం లేని)  కార్మికుల రోజువారీ కనీస వేతనం ఖరారు చేస్తూ కలెక్టర్‌ కోన శశిధర్‌ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఖరారు చేసిన కనీస వేతనం  మహిళ, పురుష కార్మికులకు వర్తిస్తుందని తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. రూరల్‌ పరిధిలో కార్మికునికి రోజువారీ వేతనం రూ.310 చొప్పున 26 రోజులకు 8,060 ఇవ్వాలి. అర్బన్, మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కార్మికునికి రోజువారీ వేతనం రూ.375 చొప్పున 26 రోజులకు 9,750 ఇవ్వాలి.  

Advertisement
 
Advertisement
Advertisement