తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి | Labour worker died by bees attack | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి

Apr 20 2016 7:08 PM | Updated on Sep 3 2017 10:21 PM

ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తిపై తేనెటీగలు దాడి చేయడంతో.. అతను మృతిచెందాడు.

గడివేముల(కర్నూలు): ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తిపై తేనెటీగలు దాడి చేయడంతో.. అతను మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలం చెస్రవాయిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొరస్వామి ఉపాధి పనుల్లో భాగంగా జేసీ కెనాల్‌లో పూడిక తీయడానికి వెళ్లాడు.

ఈ క్రమంలో పనులు చేస్తుండగా.. తేనె టీగలు దాడి చేశాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన తోటి కూలీలు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement