తేనెటీగల దాడి.. టాంజానియాలో వరంగల్‌ కౌలు రైతు మృతి | Warangal Man Succumbed To Death Killer Bees Attack Tanzania | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడి.. టాంజానియాలో మృతి చెందిన వరంగల్‌ కౌలు రైతు

Mar 28 2023 8:16 PM | Updated on Mar 28 2023 9:35 PM

Warangal Man Succumbed To Death Killer Bees Attack Tanzania - Sakshi

సాక్షి,వరంగల్‌: పొట్టకూటి కోసం దేశంకాని దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. టాంజానియాలో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు పడకంటి బ్రహ్మచారి తేనేటీగలు దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.

చికిత్స పొందుతూ బ్రహ్మచారి ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. మృతుని స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేట. ఉన్న ఊరిలో బతుకుభారమై పరాయి దేశానికి వెళ్లిన బ్రహ్మచారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడని స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement