చెట్టుపై నుంచి పడి కూలీ మృతి | labour dies of fall to tree | Sakshi
Sakshi News home page

చెట్టుపై నుంచి పడి కూలీ మృతి

Feb 15 2017 10:40 PM | Updated on Jul 11 2019 8:56 PM

రొళ్ల మండలం వన్నప్పపాళ్యం గ్రామానికి చెందిన పాండురంగప్ప (60) అనే కూలీ చింతచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

రొళ్ల (మడకశిర) : రొళ్ల మండలం వన్నప్పపాళ్యం గ్రామానికి చెందిన పాండురంగప్ప (60) అనే కూలీ చింతచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్‌ బషీర్‌ తెలిపిన మేరకు.. పాండురంగప్ప చింతకాయలను తొలగించేందుకు తోటి కూలీలతో కలిసి క్యాతప్పపాళ్యం వద్దకు వెళ్లాడు. చింతచెట్టు ఎక్కికాయలను తొలగిస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు రంగనాథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement