కొవ్వూరులో సంచలనం రేపిన టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, 16వ వార్డు కౌన్సిలర్ పాకా టీడీపీ నేత గోపాలకృష్ణ(52) హత్యకేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.
పశ్చిమ గోదావరి : కొవ్వూరులో సంచలనం రేపిన టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, 16వ వార్డు కౌన్సిలర్ పాకా టీడీపీ నేత గోపాలకృష్ణ(52) హత్యకేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఇసుక మాఫియాతో వివాదాలు కారణంగానే హత్యకు దారితీసినట్లు తెలుస్తుంది.
గోపాలకృష్ణ హత్య కేసును జిల్లా పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి ఆయుధాలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇసుక మాఫియా గొడవలు కారణంగానే గోపాలకృష్ణ హత్య జరిగినట్లు శనివారం డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. కొవ్వూరు- నిడదవోలు రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం గోపాలకృష్ణను ఇద్దరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే.