పట్టాలు తప్పిన కొచ్చి ఎక్స్‌ప్రెస్ | kochi train derailed | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన కొచ్చి ఎక్స్‌ప్రెస్

Nov 17 2015 3:18 AM | Updated on Sep 3 2017 12:34 PM

కొచ్చివ్యాలి నుంచి గౌహతి వెళ్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమవారం అర్ధరాత్రి వైఎస్‌ఆర్ జిల్లా నందలూరు సమీపంలోని మంటపంపల్లె వద్ద పట్టాలు తప్పింది.

తిరుపతి/రాజంపేట రూరల్: కొచ్చివ్యాలి నుంచి గౌహతి వెళ్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ సోమవారం అర్ధరాత్రి వైఎస్‌ఆర్ జిల్లా నందలూరు సమీపంలోని మంటపంపల్లె వద్ద పట్టాలు తప్పింది. భారీ వర్షం కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రెండు బోగీలు పక్కకు ఒరిగి పోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

నెల్లూరు జిల్లా గూడూరు మీదుగా వెళ్లాల్సిన ఈ ఎక్స్‌ప్రెస్‌ను వర్షాల కారణంగా రేణిగుంట, రాజంపేట మీదుగా మళ్లించారు. రేణిగుంట నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. మరొక ట్రాక్‌లో కడప నుంచి వచ్చే రైళ్లను నడుపుతున్నారు. సహాయక చర్యల కోసం రేణిగుంట రైల్వే బృందం తరలివెళ్లింది.
 

Advertisement
 
Advertisement
Advertisement