ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ విజేత ‘అనంత’ | khelo india football winner anantha | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియా ఫుట్‌బాల్‌ విజేత ‘అనంత’

Jan 20 2017 12:01 AM | Updated on Oct 2 2018 8:39 PM

శ్రీకాకుళం : ఖేలో ఇండియా రాష్ట్ర ఫుట్‌బాల్‌ బాలబాలికల విజేతలుగా అనంతపురం, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం, నైరా వ్యవసాయ కళాశాల, కేంద్రీయ విద్యాలయం క్రీడా ప్రాంగణాల్లో మూడు రోజులుగా సాగిన ఖేలో ఇండియా రాష్ట్ర బాలబాలికల అండర్‌–14 ఫుట్‌బాల్‌ పోటీలు గురువారం ముగిశాయి.

శ్రీకాకుళం : ఖేలో ఇండియా రాష్ట్ర ఫుట్‌బాల్‌ బాలబాలికల విజేతలుగా అనంతపురం, చిత్తూరు జిల్లాల జట్లు నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం, నైరా వ్యవసాయ కళాశాల, కేంద్రీయ విద్యాలయం క్రీడా ప్రాంగణాల్లో మూడు రోజులుగా సాగిన ఖేలో ఇండియా రాష్ట్ర బాలబాలికల అండర్‌–14 ఫుట్‌బాల్‌ పోటీలు గురువారం ముగిశాయి. బాలుర విభాగంలో జరిగిన ఉత్కంఠ పోరులో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన వైఎస్సార్‌ కడపపై చిత్తూరు జట్టు 2–1 గోల్స్‌ తేడాతో జయభేరి మోగించింది. మరో మ్యాచ్‌లో అనంతపురంపై కర్నూలు జట్టు గెలిచింది. 

అనంత అదరహో..
కేంద్రీయ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో మధ్యాహ్నం జరిగిన బాలికల విభాగం తుది పోరులో అనంతపురం విజేతగా నిలిచింది. కర్నూలుతో జరిగిన ఫైనల్‌ పోరులో 2–1 గోల్స్‌ తేడాతో విజయభేరి మోగించింది. మరో మ్యాచ్‌లో శ్రీకాకుళంపై 3–0 గోల్స్‌ తేడాతో వైఎస్సార్‌ కడప విజయం సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement