కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం | KCR portrait anointed with milk | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Jul 21 2016 7:58 PM | Updated on Jun 4 2019 6:37 PM

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం - Sakshi

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

మఠంపల్లి : పాలమూరు జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల సాగు కోసం ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల చేయడం పట్ల టీఆర్‌ఏస్‌ నాయకులు గురవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

మఠంపల్లి : పాలమూరు జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల సాగు కోసం ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల చేయడం పట్ల టీఆర్‌ఏస్‌ నాయకులు గురవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కోలాహలం కృష్ణంరాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడి తాగు, సాగు నీటికి నోచుకోని పాలమూరు బీడు భూములను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం కే సీఆర్‌ నాయకత్వంలోనే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు జయమ్మహుస్సేన్‌గౌడ్, రుక్కిబాలునాయక్, మండల మాజీ అధ్యక్షుడు పోతబత్తిని శ్రీనివాస్, బీసీ సెల్‌మండల అధ్యక్షులు పిల్లుట్ల కొండలు, యల్లావుల నాగయ్యయాదవ్, నర్సింహారెడ్డి, బాలాజీనాయక్, వెంకన్న, వీరన్న పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement