'తెలంగాణకు ఐపీఎస్ల సంఖ్య పెంచాలి' | kcr meeting with rajnath singh | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు ఐపీఎస్ల సంఖ్య పెంచాలి'

Feb 13 2016 2:25 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణకు ఐపీఎస్ల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను సీఎం కేసీఆర్ కోరారని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి వెల్లడించారు.

న్యూఢిల్లీ : తెలంగాణకు ఐపీఎస్ల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను సీఎం కేసీఆర్ కోరారని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఎస్ వేణుగోపాలచారి విలేకర్లతో మాట్లాడుతూ... విభజన చట్టం మేరకు అసెంబ్లీ సీట్లను పెంచాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారని చెప్పారు. అలాగే ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని ఆయన్ని కేసీఆర్ కోరారని తెలిపారు. అన్ని విషయాలకు రాజ్నాథ్సింగ్ సానుకూలంగా స్పందించారని వేణుగోపాలచారి పేర్కొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement