కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం | Kalvart work Start | Sakshi
Sakshi News home page

కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం

Jul 22 2016 6:34 PM | Updated on Sep 4 2017 5:51 AM

మంగంపేట స్టేజి దగ్గర జరుగుతున్న కల్వర్టు పనులు

మంగంపేట స్టేజి దగ్గర జరుగుతున్న కల్వర్టు పనులు

మంగంపేట (మల్దకల్‌) : మండలంలోని మంగంపేట స్టేజీ సమీపంలో గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

మంగంపేట (మల్దకల్‌) : మండలంలోని మంగంపేట స్టేజీ సమీపంలో గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ర్యాలంపాడు రిజర్వాయర్‌ ద్వారా 108 ప్యాకేజీ కింద చేపట్టిన కాల్వ ఏర్పాటులో భాగంగా ఈ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో కల్వర్టు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా అమరవాయి, నీలిపల్లి, పాలవాయి, కొండపల్లి, రేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు ప్రధాన కాలువ ఇదే కావడంతో నిర్మాణం పనులు పూర్తయితే కాని కాల్వ ద్వారా నీరు వెళ్లే పరిస్థితి లేదని, వెంటనే కల్వర్టు నిర్మాణం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement