స్పాట్‌ అడ్మిషన్లకు చివరి గడువు | july 20th last date for polytechnic spot admissions | Sakshi
Sakshi News home page

స్పాట్‌ అడ్మిషన్లకు చివరి గడువు

Jul 17 2016 10:54 PM | Updated on Sep 18 2018 7:45 PM

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులు సోమవారం సాయంత్రం లోగా దరఖాస్తులు చేసుకోవాలని కౌన్సెలింగ్‌ ఇన్‌చార్జి విద్యాసాగర్‌రావు తెలిపారు.

నంగునూరు : పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులు సోమవారం సాయంత్రం లోగా దరఖాస్తులు చేసుకోవాలని కౌన్సెలింగ్‌ ఇన్‌చార్జి విద్యాసాగర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరేం దుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కో–ఎడ్యుకేషన్‌తో పాటు మహిళా కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు వరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు అధార్‌కార్డు, ఫొటోలు అందజేయాలని సీటు లభించిన విద్యార్థులు అదే రోజు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement