రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా | jobmela by reddys lab | Sakshi
Sakshi News home page

రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

Dec 9 2016 11:42 PM | Updated on Sep 27 2018 5:12 PM

జిల్లాలోని ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ జమీర్‌ అహమ్మద్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లాలోని ముస్లిం మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ జమీర్‌ అహమ్మద్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ జాబ్‌మేళా గుంటూరు, కర్నూలులో నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరులో ఈ నెల 16, 17న రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో ఈ నెల 22, 23న రాత పరీక్ష, ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఠీఠీఠీ.్చpటఝజఛి.ఛిౌఝ, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554–246615లో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement