క్రీస్తు మార్గం అనుసరణీయం
													 
										
					
					
					
																							
											
						 ఏసీ కళాశాల సమీపంలోని పునీత ఆగ్నేశమ్మ దేవాలయంలో బుధవారం కృతజ్ఞతా దివ్య పూజా బలి మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
						 
										
					
					
																
	కథోలిక సంఘ పీఠాధిపతి గాలి బాలి
	 
	గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాల సమీపంలోని పునీత ఆగ్నేశమ్మ దేవాలయంలో బుధవారం కృతజ్ఞతా దివ్య పూజా బలి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కథోలిక సంఘ పీఠాధిపతిగా రెవరెండ్ డాక్టర్ గాలి బాలి 32 ఏళ్లపాటు సేవలందించినందుకుగాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత అరండల్‌పేట ఎనిమిదో లైను నుంచి గాలి బాలిని ఊరేగింపుగా దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు అడుగు జాడల్లో నడిచినందునే కథోలిక సంఘం ఆశీర్వాదం పొందిందన్నారు. సేవా కార్యక్రమాలే సంఘానికి ఊపిరి అని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సంఘ సభ్యులంతా ముందుకు కదలాలని సందేశమిచ్చారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో  పాస్టర్ పిల్లి ఆంథోని పాల్గొన్నారు.