టీఆర్‌ఎస్‌ను ఓడించాలి: జానా | janareddy comments on trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి: జానా

May 13 2016 4:10 AM | Updated on Mar 22 2019 6:17 PM

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి: జానా - Sakshi

టీఆర్‌ఎస్‌ను ఓడించాలి: జానా

రోజూ పార్టీల ఫిరాయింపులు, మాట వినని నాయకులను భయపెట్టి, డబ్బులు, కాంట్రాక్టులు ఎరపెట్టి పార్టీలు మారేలా చేయడం..

ఖమ్మం: ‘రోజూ పార్టీల ఫిరాయింపులు, మాట వినని నాయకులను భయపెట్టి, డబ్బులు, కాంట్రాక్టులు ఎరపెట్టి పార్టీలు మారేలా చేయడం.. ఇలా ప్రజాస్వామ్యం, విలువలు మంటగలిసి పోతున్న తరుణంలో వచ్చిన పాలేరు ఎన్నిక  రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలి.. టీఆర్‌ఎస్ పార్టీని ఓడించి ప్రజాస్వామ్యానికి జీవం పోయాలి.’ అని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పాలేరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల తెలంగాణ  ఉద్యమంపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు.

అప్పట్లో  కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేసీఆర్ ఉద్యమాన్ని అణచివేయడం పెద్దపనేమీ కాదని అన్నారు. దివంగత నేత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితారెడ్డిపై తెలంగాణ ఉద్య మం అంటే గిట్టని తుమ్మల నాగేశ్వరరావును గెలిపించేందుకు రాష్ట్ర మం త్రులు, ఎమ్మెల్యేలు పాలేరులో తిష్టవేయడం శోచనీయమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement