గుణశేఖర్‌ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు! | it raids on gunasekhar yadav house | Sakshi
Sakshi News home page

గుణశేఖర్‌ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు!

Dec 29 2016 3:39 PM | Updated on Sep 27 2018 3:37 PM

గుణశేఖర్‌ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు! - Sakshi

గుణశేఖర్‌ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు!

మంత్రి నారాయణకు సన్నిహితుడైన డాక్టర్‌ గుణశేఖర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

తిరుపతి: మంత్రి నారాయణకు సన్నిహితుడైన డాక్టర్‌ గుణశేఖర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు గుణశేఖర్‌కు వందల కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులున్నట్టు గుర్తించినట్టు సమాచారం. కాగా ఐటీ అధికారులు వివరాలను గోప్యంగా ఉంచారు.

మంత్రి నారాయణకు గుణశేఖర్‌ బినామీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీటీడీ ఏడీ బిల్డింగ్‌ పక్కన బహుళ అంతస్తుల భవనాన్ని గుణశేఖర్‌ కొనుగోలు చేశాడు. ఐటీ అధికారులపై మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తున్నారని అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement