breaking news
gunasekhar yadav
-
ఐటి దాడులతో వేడెక్కిన తిరుపతి రాజకీయం
తిరుపతి తుడా : ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యుడు డాక్టర్ గుణశేఖర్ యాదవ్ తన భార్యకు తిరుపతి మేయర్ టికెట్ ఖరారు చేసుకున్నారనే నేపథ్యంలో ఐటీదాడులు షాకిచ్చాయి. అంతర్గత విభేదాలతోనే ఈ దాడులు జరిగా యా అని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి వున్న తమను కాదని కొత్త వ్యక్తికి ఎలా ఇస్తారని కొందరు, మంత్రి నారాయణ జోక్యంపై మరికొందరు అధిష్టానానికి గతంలోనే ఫిర్యాదు చేశారు. గుణశేఖర్ యాదవ్‌ను మేయర్ రేసు నుంచి తప్పించాలంటే ఐటీ దాడులే సరైన మార్గమని ఓ ఎమ్మెల్యే సమీప బంధువు, ఓ మహిళా నేత పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. యాదవ వర్గానికే మేయర్ టికెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన గుణశేఖర్ మంత్రి నారాయణ ద్వారా పావులు కదిపారు. తిరుపతిలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆర్థిక వనరులెక్కువగా వుండడంతో మంత్రి ఆయనపైనే మొగ్గు చూపుతూ వచ్చారు. టికెట్ పోటీలో ముందు వరుసలో వున్న గుణశేఖర్ యాదవ్‌పై ఐటీ గురిపెట్టి భారీ మొత్తంలో ఆస్తులున్నట్లు గుర్తించడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో ఆశావాహ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. సామాజిక వర్గం పరంగా నర్సింహయాదవ్ ముందు వరుసలో వుండగా ఎమ్మెల్యే వర్గం ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని తెరపైకి తెచ్చేం దుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. డాక్టర్ సుధారాణి పార్టీతో సన్నిహితంగా వుంటూ మేయర్ టికెట్ లేదా తుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. -
గుణశేఖర్ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు!
తిరుపతి: మంత్రి నారాయణకు సన్నిహితుడైన డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు గుణశేఖర్‌కు వందల కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులున్నట్టు గుర్తించినట్టు సమాచారం. కాగా ఐటీ అధికారులు వివరాలను గోప్యంగా ఉంచారు. మంత్రి నారాయణకు గుణశేఖర్ బినామీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టీటీడీ ఏడీ బిల్డింగ్ పక్కన బహుళ అంతస్తుల భవనాన్ని గుణశేఖర్ కొనుగోలు చేశాడు. ఐటీ అధికారులపై మంత్రి నారాయణ ఒత్తిడి తెస్తున్నారని అనుమానిస్తున్నారు.