 
															కాల్వలో పడి విద్యార్థిని మృతి
													 
										
					
					
					
																							
											
						 తెనాలి రూరల్ (గుంటూరు) : కాల్వలో పడి ఇంటర్  విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.
						 
										
					
					
																
	 
	తెనాలి రూరల్ (గుంటూరు) : కాల్వలో పడి ఇంటర్  విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన దామర్ల భవాని లక్ష్మి (16) పట్టణ టీజే కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బుధవారం కళాశాలకు వెళ్లిన ఆమె రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె కనబడడం లేదంటూ తండ్రి భరతరావు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం జగ్గడిగుంటపాలెం సమీపంలోని తూర్పు కాలువలో విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.