సూర్యాపేటమున్సిపాలిటీ : అంతర్‌రాష్ట్ర దొంగను సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్
Jul 23 2016 7:50 PM | Updated on Aug 20 2018 4:27 PM
సూర్యాపేటమున్సిపాలిటీ :
అంతర్‌రాష్ట్ర దొంగను సూర్యాపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. శనివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్ వెల్లడించారు. కేతేపల్లి మండలం పొర్లపహాడ్ గ్రామానికి చెందిన చిలుకూరి శంకర్ తెల్లవారుజామున సూర్యాపేటలోని హైటెక్ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకర్‌ను విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నట్టు తెలిపారు. శంకర్‌పై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు స్టేషన్‌లో దొంగతనం కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొంగిలించిన వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడని చెప్పారు. శంకర్ వద్ద నుంచి 12సెల్‌ఫోన్లు, 1 ల్యాప్‌టాబ్, రెండు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శంకర్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. సమావేశంలో పట్టణ ఇన్‌స్పెక్టర్ వై.మొగలయ్య, ఎస్‌ఐలు క్రాంతికుమార్, బాసిత్, ఐడీ పార్టీ పోలీసులు గోదేషి కరుణాకర్, శనగాని వెంకన్నగౌడ్, గొర్ల కృష్ణ, చామకూరి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement