రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి | injuered person died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

Jul 19 2016 11:41 PM | Updated on Apr 3 2019 7:53 PM

మేళ్లచెర్వు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన బొగ్గవరపు సైదయ్య(40)బైక్‌ 17వ తేదీన పని నిమిత్తం కోదాడకు వెళ్లాడు.

మేళ్లచెర్వు:
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన బొగ్గవరపు సైదయ్య(40)బైక్‌ 17వ తేదీన పని నిమిత్తం కోదాడకు వెళ్లాడు. రాత్రి సమయంలో స్వగ్రామానికి వెళుతుండగా మండలకేంద్రం శివారు లోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఎదరుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సైదయ్యను తొలుత కోదాడ అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా  చిక్తిత్స పొందుతూ సోమవారం రాత్రి  మృతిచెందాడు. మృతదేహానికి మంగళవారం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement