ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్ | Indira Priyadarshini Stadium svacchabharat | Sakshi
Sakshi News home page

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్

Nov 23 2016 1:32 AM | Updated on Sep 4 2017 8:49 PM

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్

ప్రతీఒక్కరు స్వచ్ఛత వైపుగా అడుగేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించా రు.

జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్

ఆదిలాబాద్ స్పోర్ట్స్ : ప్రతీఒక్కరు స్వచ్ఛత వైపుగా అడుగేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా లు, పట్టణాల్లో స్వచ్చభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తూ యువత ఆదర్శంగా నిలవాలన్నారు. విద్యార్థులు సేవా దృక్పదాన్ని కలిగి ఉండి సమాజా ఉన్నతికి తమవంతు కృషి చేయాలని సూచించారు. భావిభారత పౌ రులు విద్యార్థులేనని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. అనంతరం ఐపీ స్టే డియంలోని పిచ్చిమొక్కలు, మైదానం  చుట్టూ ఉన్న పి చ్చిమొక్కలు తొలగించి గుంతలను పూడ్చారు.  ఈ కా ర్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్దన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయ కర్త తిరుపతి రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement