ఎస్కేయూను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం | independance day celebrations in sku | Sakshi
Sakshi News home page

ఎస్కేయూను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం

Aug 15 2017 10:52 PM | Updated on Nov 6 2018 5:13 PM

ఎస్కేయూను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం - Sakshi

ఎస్కేయూను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలుపుదామని వీసీ ప్రొఫెసర్‌ కే.రాజగోపాల్‌ అన్నారు.

ఎస్కేయూ(అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలుపుదామని వీసీ ప్రొఫెసర్‌ కే.రాజగోపాల్‌ అన్నారు. 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఎస్కేయూ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం వీసీ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి మహనీయులు చేసిన కృషిని మరువలేనిదన్నారు.

దేశంలోని స్టేట్‌ వర్సిటీలలో  కేవలం ఒక్క ఎస్కేయూకు మాత్రమే అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ దక్కిందన్నారు. విద్యార్థుల సంక్షేమమే అంతిమధ్యేయంగా కృషి చేస్తామన్నారు. క్యాంపస్‌ స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కే.సుధాకర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement