కృష్ణమ్మ తుళ్లింత | increase in water level | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ తుళ్లింత

Aug 16 2016 11:34 PM | Updated on Sep 4 2017 9:31 AM

కృష్ణమ్మ తుళ్లింత

కృష్ణమ్మ తుళ్లింత

ఎగువన పులిచింతల, నాగార్జునసాగర్‌ ల నుంచి నీటి రాక పెరగడంతో కృష్ణానది నిండుగా కళకళలాడుతోంది. ఎప్పుడెప్పుడు గేట్లు ఎత్తేస్తారా.. ఎంత త్వరగా పరుగులు తీద్దామా అన్నట్లుగా కృష్ణమ్మ బ్యారేజీ నుంచి తుళ్లిపడుతోంది.

మొగల్రాజపురం:
ఎగువన పులిచింతల, నాగార్జునసాగర్‌ ల నుంచి నీటి రాక పెరగడంతో కృష్ణానది నిండుగా కళకళలాడుతోంది. ఎప్పుడెప్పుడు గేట్లు ఎత్తేస్తారా.. ఎంత త్వరగా పరుగులు తీద్దామా అన్నట్లుగా కృష్ణమ్మ బ్యారేజీ నుంచి తుళ్లిపడుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ గేట్ల నుంచి నీరు ఎగసిపడుతూ అక్కడ ఉన్న టబ్‌లు (తొట్లు) నిండి అప్రాన్‌ వైపునకు పరవళ్ళు తొక్కాయి. అప్రాన్‌ మొత్తం నీటితో నిండింది. అప్రాన్‌పై ఏర్పాటు చేసిన పోలీస్‌ అవుట్‌పోస్ట్‌లోకి కూడా నీరు రావడంతో నీటిలో ఉండే∙సిబ్బంది విధులు నిర్వహించారు. అప్రాన్‌పై ఏర్పాటు చేసిన అమరావతి ఫుడ్‌కోర్డు కుర్చీలు, సామాగ్రి  నీటి తాకిడికి చెల్లాచెదురు అయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement