రూపాయి కూడా తగ్గదు..! | Increase In Vegetable Prices | Sakshi
Sakshi News home page

రూపాయి కూడా తగ్గదు..!

Nov 12 2026 8:07 AM | Updated on Nov 12 2026 8:07 AM

Increase In Vegetable Prices

శ్రీకాకుళం: కూరగాయలు, నిత్యావసర ధరల మోత మోగుతోంది. వరుసగా పెరుగుతున్న రేట్లకు కార్తీక మాసం కూడా తోడవ్వడంతో మార్కెట్‌కు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. జేబునిండా డబ్బులు వేసుకుని వెళ్లినా సంచి నిండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇంత దారుణ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. అప్పట్లో ధరలు ఒకటి రెండు నెలలు పెరిగినా మళ్లీ యథాస్థితికి వచ్చేవని, ఇప్పుడా పరిస్థితి లేదని వాపోతున్నారు. 

అన్ని ధరలూ అంతే.. 
రెండున్నర‡ కేజీల ఉల్లి రూ.100 నుంచి ఏకంగా రూ.150కు ఎగబాకింది. ఇదే సాకుతో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి మరీ ధరలు పెంచేస్తున్నారు. పనుల్లేక ఇబ్బందులు పడుతున్న రోజువారీ కార్మికులకు ఈ ధరలు మరింత షాక్‌ కొడుతున్నాయి. వారానికి అవసరమైన కూరగాయలు కొనుగోలు చేసుకోవాలంటే రూ.1000 వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం సామాన్యులతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం అందించే నిర్వాహకులపైనా పడుతోంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ ఖర్చుకు, మార్కెట్‌ ధరలకు అస్సలు పొంతన ఉండటం లేదని గగ్గోలు పెడుతున్నారు.  

పండగ పూట పెనుభారం 
కార్తీక మాసం కావడంతో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటారు. దీంతో కూరగాయల ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఉల్లిపాయలు కిలో రూ.60, నాటుచిక్కుళ్లు రూ.60, వంకాయలు రూ.60, పచ్చిమిర్చి రూ.60 నుంచి రూ.80,  బీన్స్‌ రూ.80, క్యారెట్‌ రూ.60, టమాటా రూ.40 నుంచి రూ.50, బెండకాయలు రూ.80, దొండకాయలు రూ.60, అల్లం రూ.100, బీట్‌రూట్‌ రూ.100, బీరకాయలు రూ.80, క్యాబేజీ రూ.40, కాప్సికమ్‌ రూ.80, చింతపండు రూ.80.. ధరలు అమాంతం పెరిగిపోయాయి. నూనె ధర రూ.160 నుంచి రూ.180 వరకూ పలుకుతోంది. ఒక్కసారిగా లీటరుపై రూ.20 నుంచి రూ.30 వరకూ పెరిగింది. కందిపప్పు, వెల్లుల్లి, మినప్పప్పు ధరలదీ అదే పరిస్థితి. ఇప్పటికైనా పాలకులు స్పందించి ధరలకు అడ్డుకట్ట వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement