ఇన్‌కమ్ ట్యాక్స్ నకిలీ అధికారి అరెస్ట్ | Incometax fake officer arrested in krishna district | Sakshi
Sakshi News home page

ఇన్‌కమ్ ట్యాక్స్ నకిలీ అధికారి అరెస్ట్

Sep 24 2015 10:35 PM | Updated on Sep 27 2018 4:27 PM

ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారినంటూ ఓ చేపల చెరువు వ్యాపారిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

కైకలూరు(కృష్ణా): ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారినంటూ ఓ చేపల చెరువు వ్యాపారిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ఓ చేపల చెరువు వ్యాపారిని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కోమరోలు గ్రామానికి చెందిన సురేశ్ కుమార్ ఆదాయపు పన్ను అధికారినంటూ భూమి విక్రయం విషయంలో బెదిరించాడు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయపడింది. పోలీసులు సురేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement