తన శాఖ అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్య అసభ్యకరంగా మాట్లాడు తూ వేధింపులకు గురి చేస్తున్నారని ద్రవిడ వర్సిటీలో తెలుగు శాఖ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి ...
పోలీసులకు ఫిర్యాదు
గుడుపల్లె : తన శాఖ అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్య అసభ్యకరంగా మాట్లాడు తూ వేధింపులకు గురి చేస్తున్నారని ద్రవిడ వర్సిటీలో తెలుగు శాఖ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి శుక్రవారం గుడుపల్లె పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు.. పనివేళల్లో అకారణంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ శ్రీదేవిని చిన్నరెడ్డెయ్య ఇబ్బందులు పెడుతున్నారు.
ఆరు నెలలగా ఈ హింసను ఆమె భరిస్తోంది. చిన్నరెడ్డెయ్యపై పలుమార్లు వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా వేధిం పులు తట్టుకోలేకపోతున్నానని, భద్రత కరువవుతోందని ఆమె తీవ్ర మన స్తాపానికి గురవు తున్నారు. వర్సిటీ అధికారులు ఇక తమకు న్యాయం చేయలేరని నమ్మకం పోయిందని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో ఆమె పోలీసులను కోరారు.