ఐజీ, డీఐజీ బదిలీ | ig dig transfer | Sakshi
Sakshi News home page

ఐజీ, డీఐజీ బదిలీ

Jun 29 2017 11:14 PM | Updated on Sep 5 2017 2:46 PM

రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు : రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు,  కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం క్రితం ఎస్పీ ఆకే రవికృష్ణను కూడా బదిలీ చేసిన విషయం విదితమే. రెండోవిడతలో భాగంగా గురువారం మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు డీఐజీ రమణకుమార్‌లను బదిలీ చేసింది. వీరికి ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చారనేది స్పష్టంగా తెలియరాలేదు. శ్రీధర్‌రావు స్థానంలో ఐజీగా ఇక్బాల్‌ను నియమించినట్లు సమాచారం. డీఐజీ రమణకుమార్‌ జిల్లాలో రెండేళ్ల 11 నెలలు పనిచేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించారనేది తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement