సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 11న నార్త్ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని.. 13 నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు - దక్షిణ కోస్తాకు దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది.
14 నుంచి ఏపీలోని కోస్తా జిల్లాలో మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమ - దక్షిణ కోస్తాలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందన్ని ఐఎండీ తెలిపింది.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


