కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి | I am with congress party only, says komatireddy venkatreddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి

Apr 15 2016 1:44 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి - Sakshi

కాంగ్రెస్ పార్టీని వీడను: కోమటిరెడ్డి

తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

నల్లగొండ రూరల్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని కొందరు.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తి అవాస్తవమన్నారు. కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారని చెప్పి.. పలువురు ప్రజాప్రతినిధులను వాళ్ల పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. పార్టీని వీడిన వారిని పట్టించుకోవద్దన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement