పల్లెలో పరిశుభ్రతకు ప్రాధాన్యం | Hygiene is importent in villages | Sakshi
Sakshi News home page

పల్లెలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

Oct 8 2016 12:30 AM | Updated on Mar 21 2019 8:35 PM

పల్లెలో పరిశుభ్రతకు ప్రాధాన్యం - Sakshi

పల్లెలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆదేశించారు.

కర్నూలు(హాస్పిటల్‌): స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆదేశించారు. శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి వనరుల లభ్యత పట్ల ఎంపీడీవోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో  2018–19 నాటికి 889 గ్రామాలను బహిరంగ మలవిసర్జనర రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరిబాబు, డీపీవో ఆనంద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement