పైశాచికం..! | husbend harrased by he's wife | Sakshi
Sakshi News home page

పైశాచికం..!

Mar 18 2016 3:39 AM | Updated on Sep 3 2017 7:59 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ పట్ల ఆమె భర్త, అత్తమామలు అకృత్యానికి పాల్పడ్డారు.

మహిళ మర్మాంగంలో జీడిపోసిన భర్త
సహకరించిన అత్తమామలు.. ముగ్గురిపై కేసు

 కౌడిపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ పట్ల ఆమె భర్త, అత్తమామలు అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె మర్మావయవంలో జీడి పోశారు. ఈ దుశ్చర్య కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ భవానీమందిర్ తండాలో చోటుచేసుకుంది. గురువారం ఏఎస్‌ఐ ఖలీమొద్ధిన్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీమందిర్ తండాకు చెందిన వివాహిత (20)ని కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త మదన్ ధరావత్, అత్త చెన్నభాయ్, మామ పాండులు పలుమార్లు వేధించారు. ఈ విషయమై గతంలో తండాలో పంచాయితీలు సైతం నిర్వహించారు. ఈనెల 15న రాత్రి బాధితురాలు నిద్రిస్తుండగా అత్త, మామ పట్టుకోగా భర్త జీడిపోసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు. తీవ్రగాయం కావడంతో గురువారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement