భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త | husband tried to kill wife | Sakshi
Sakshi News home page

భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

Jul 26 2016 11:49 PM | Updated on Jul 30 2018 8:41 PM

భార్యపై కిరోసిన్‌ పోసి భర్త నిప్పంటించిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లిలో సోమవారం రాత్రి జరిగింది.

  • ఎంజీఎంలో చికిత్స పొందుతున్నబాధితురాలు
  • చెన్నారావుపేట : భార్యపై కిరోసిన్‌ పోసి భర్త నిప్పంటించిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కడబోయిన సదయ్య కుమార్తె సరితను పదేళ్లక్రితం ఉప్పరపల్లికి చెందిన కుక్కల రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ న్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్‌పోసి నిప్పం టించాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఎంజీ ఎంకు తరలించారు. బాధిత మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement