భార్యను హత్య చేసిన భర్త ! | husband kills wife on illegal relationship | Sakshi
Sakshi News home page

భార్యను హత్య చేసిన భర్త !

Sep 16 2017 5:17 PM | Updated on Jul 30 2018 8:37 PM

హత్యకు గురైన సులోచన - Sakshi

హత్యకు గురైన సులోచన

వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను హత్యచేసి పిల్లలను అనాథలుగా మిగిల్చిన సంఘటన మైదుకూరు మండలం పుల్లయ్యసత్రం గ్రామంలో చోటు చేసుకొంది.

భర్త వివాహేతర సంబంధమే కారణం..?
మైదుకూరు టౌన్‌ : వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను హత్యచేసి పిల్లలను అనాథలుగా మిగిల్చిన సంఘటన మైదుకూరు మండలం పు     ల్లయ్యసత్రం గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు మండలం నడింపల్లె గ్రామానికి చెందిన కుమ్మరి రామకృష్ణ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడు గ్రామానికి చెందిన కుమ్మరి సులోచన(29) తో 10 సంవత్సరాల కిందట  వివాహమైంది. రామకృష్ణ వృత్తిరీత్యా ఆచారిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత ఐదేళ్ల నుంచి పుల్లయ్య సత్రం గ్రామంలో సొంత ఇల్లు కట్టుకొని జీవనం సాగించేవాడు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా రామకృష్ణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తరచూ ఇంటిలో గొడవ పడుతుండేవాడు.

ఇటీవల గ్రామంలో కూడా  పెద్ద మనుషులతో  పంచాయితీ కూడా జరిగింది. అయినా రామకృష్ణ పద్ధతి మార్చుకోకుండా వివాహేతర సంబంధం ఉన్న మహిళను ఇంటిలో తెచ్చిపెట్టుకోవాలని భార్య సులోచనతో గొడవ పడుతుండేవాడు. శుక్రవారం ఉదయం ఇంటిలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భార్యను హత్య చేసినట్లు అక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. భార్య మెడ, చేతి భాగంలో కత్తితో కోసినట్లు, ఈడ్చుకుంటూ వచ్చినట్లు ఆధారాలు ఉండటంతో హత్యచేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సులోచన తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనను ముమ్మాటికీ అల్లుడే చంపాడని సుబ్బరాయుడు మృతదేహంపై బోరున విలపించాడు. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను చూసిన వాళ్లంతా కంటతడిపెట్టారు. సులోచన హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలం పరిశీలించిన పోలీసులు మృతదేహంను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement