ఎంత పెద్ద కొండచిలువో..!
మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో శనివారం భారీ కొండచిలువను హతమార్చారు.
నాదెండ్ల: మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో శనివారం భారీ కొండచిలువను హతమార్చారు. గ్రామంలో నాలుగు వైపులా కొండలు, గుట్టలు ఉండటంతో జెండా చెట్టు సమీపంలోని నాగూర్‌వలి అనే వ్యక్తి పుల్లలవామి నుంచి 4 అడుగుల కొండచిలువ బయటకొచ్చింది. దీన్ని చూసిన స్థానికులు చంపేందుకు ప్రయత్నించగా, కొద్దినిమిషాలకే 12 అడుగుల పొడవు గల తల్లి కొండచిలువ బయటకొచ్చింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటికి రెండు కొండ చిలువలను హతమార్చారు.