మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లి ప్రధాన కూడలి వద్ద ఎస్సై రాజు తనసిబ్బందితో వాహనాలు తనిఖీచేస్తుండగా మంథని మండలం సూరయ్యపల్లికి చెందిన వేల్పుల కిరణ్, బట్టుపల్లి గ్రామానికి చెందిన కట్టెకోళ్ల దేవెందర్ ద్విచక్రవాహనంపై రెండు దుప్పిపిల్లలను తీసుకెళ్తూ పట్టుబడ్డారు.
పోలీసుల అదుపులో వన్యప్రాణుల వేటగాళ్లు?
Sep 27 2016 11:39 PM | Updated on Aug 21 2018 5:54 PM
మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లి ప్రధాన కూడలి వద్ద ఎస్సై రాజు తనసిబ్బందితో వాహనాలు తనిఖీచేస్తుండగా మంథని మండలం సూరయ్యపల్లికి చెందిన వేల్పుల కిరణ్, బట్టుపల్లి గ్రామానికి చెందిన కట్టెకోళ్ల దేవెందర్ ద్విచక్రవాహనంపై రెండు దుప్పిపిల్లలను తీసుకెళ్తూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని దుప్పి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను ఆజంనగర్ అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నిందితులు వేటగాళ్లా..? లేక కాపాడేందుకే తీసుకొచ్చారా..? అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Advertisement
Advertisement